ట్విట్టర్ డౌన్ అయ్యిందా ? సాంకేతిక స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని యూజ‌ర్ల ఫిర్యాదులు..!

-

ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లో ట్విట్ట‌ర్ Twitter యూజ‌ర్లు సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. కొంద‌రు ట్విట్ట‌ర్‌లోకి లాగిన్ అవ‌లేక‌పోతున్నామ‌ని ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక కొంద‌రికి ప్రొఫైల్ యాక్సెస్ అవ‌డం లేద‌ని, కొంద‌రికి టైమ్ లైన్ ఫీచ‌ర్ రావ‌డం లేద‌ని అంటున్నారు. ఇక కొందరు కేవ‌లం ఫోన్ల‌లోనే ట్విట్ట‌ర్ వ‌స్తుంద‌ని, కంప్యూట‌ర్ల‌లో రావ‌డం లేద‌ని ఫిర్యాదులు చేస్తున్నారు.

ట్విట్ట‌ర్/ Twitter
ట్విట్ట‌ర్ /Twitter

అయితే దీనిపై ట్విట్ట‌ర్ స్పందించింది. తాము స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తున్నామ‌ని తెలిపింది. అందువ‌ల్ల యూజ‌ర్లు ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని, వీలైనంత త్వ‌ర‌గా వారు ఆయా ఫీచ‌ర్ల‌ను యాక్సెస్ చేసేలా స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని ట్విట్ట‌ర్ తెలిపింది. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ స‌పోర్ట్ ట్వీట్ చేసింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక చోట్ల ట్విట్ట‌ర్‌లో ఈ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని తెలిసింది. యూజ‌ర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఇప్ప‌టికే స‌మ‌స్య ప‌రిష్కారం అయిన‌ట్లు తెలిసింది. గురువారం ఉద‌యం నుంచి ట్విట్ట‌ర్ లో సాంకేతిక స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. కాగా ఇటీవ‌లి కాలంలో కేంద్ర ప్ర‌భుత్వానికి, ట్విట్ట‌ర్‌కు మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న విష‌యం విదిత‌మే. భార‌త్ మ్యాప్‌ను త‌ప్పుగా చూపినందుకు దేశ ప్ర‌జ‌లు ట్విట్ట‌ర్‌పై మండి ప‌డ్డారు. చూస్తుంటే ట్విట్ట‌ర్‌కు టైం బాగాలేన‌ట్లు అర్థ‌మ‌వుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news