గుజరాత్​లో ఐఎస్​ఐ ఏజెంట్ అరెస్ట్… వీడు పేటీఎం బ్యాచే..!

-

పాకిస్థాన్​ ఐఎస్​ఐ ఏజెంట్​గా పని చేస్తున్న రజాక్​భాయ్​ అనే వ్యక్తిని గుజరాత్​ పశ్చిమ కచ్​ జిల్లాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) అరెస్టు చేసింది. ఉత్తర్​ప్రదేశ్​లో నమోదైన ఒక కేసు విచారణలో భాగంగా వచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించింది. ఉత్తర్​ప్రదేశ్​లో పాక్​ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎండీ రషీద్ అనే వ్యక్తిని జనవరిలో అదుపులోకి తీసుకున్నారు అధికారులు. విచారణలో సదరు వ్యక్తి.. పాకిస్థాన్​కు చెందిన రక్షణ, ఐఎస్ఐ అధికారులకు.. దేశ సమాచారాన్ని చేరవేసినట్లు గుర్తించారు.

ఇప్పటి వరకు రెండు సార్లు పాకిస్థాన్​ వెళ్లి అక్కడి అధికారులతో భేటీ అయినట్లు నిర్ధరించారు. రక్షణ బలగాల కదలికలు, రక్షణకు సంబంధించిన పలు ప్రదేశాల సమాచారాన్ని కూడా అందజేసినట్లు అధికారులు తెలిపారు..సమాచారం చేరవేసినందుకు గానూ గుజరాత్​లోని రజాక్​భాయ్​.. రిజ్వాన్​ అనే వ్యక్తి పేటీఎం నుంచి రషీద్​కు 50 వేల రూపాయలను జమ చేసినట్లు ఎన్​ఐఏ అధికారులు గుర్తించారు. ఐఎస్ఐ ఆదేశాల మేరకు రషీద్​కు నగదు పంపినట్లు తెలిపారు.​ దీంతో రజాక్​భాయ్​ను అరెస్టు చేసింది ఎన్​ఐఏ. అతడి ఇంటిలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news