అందాలు ఆరబోసినా అమ్మడికి చాన్సులు కరువయ్యాయా…?

నిధి అగర్వాల్‌.. నభా నటేశ్‌ హీరోయిన్స్‌గా కంటే.. ఇస్మార్ట్‌ శంకర్‌ భామలుగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. బీచ్‌లో ఈ ఇద్దరూ వడ్డించిన ఇస్మార్ట్‌ అందాలు సినిమా సక్సెస్‌కు ఉపయోగపడ్డాయి. ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత బిజీ అయిపోతామని ఈ ఇద్దరూ ఆశించారు. అయితే.. ఈఇద్దరిలో ఒకర్ని మాత్రమే ఆఫర్స్‌ వరించాయి.

ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌ పెద్ద హీరోలతో జత కట్టే ఛాన్స్‌ తీసుకొస్తుందని నిధి, నభా ఆశపట్టారు. నభా మాత్రం కాస్త లేటైనా.. నాలుగైదు ఆఫర్స్‌తో బిజీ అయిపోయింది. నిధికి మాత్రం చాన్సులు కరువయ్యాయి.నిధి స్కిన్ షోను మాత్రమే నమ్ముకుంటే.. నభా స్కిన్‌షోతోపాటు.. పెర్‌ఫార్మెన్స్‌ను కూడా నమ్ముకుంది. నిధి పెర్‌ఫార్మెన్స్‌లో వీక్‌ కావడం.. నభాకు ప్లస్‌ అయింది.