“చంద్రయాన్ 3” పై ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు

-

భారతదేశం మొత్తాన్ని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్ గా గగనతలంలో తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తోంది. ఈ చంద్రయాన్ 3 గురించి ఇస్రో శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అందిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఇస్రో చీఫ్ సోమనాథ్ కొన్ని విషయాలను వెల్లడించారు. ఈయన మాట్లాడుతూ చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కు చెందిన ల్యాండర్ మరియు రోవర్ లు రెండూ కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నారు. ఎప్పటికప్పుడు అక్కడి నుండి మాకు డేటా వస్తోందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు సోమనాధ్. ఈ ప్రయోగాన్ని మొదలు పెట్టిన రోజు నుండి 14వ రోజు ముగిసే లోగానే మేము పెట్టుకున్న లక్ష్యం పూర్తి అవుతుందని ఈయన తెలపడం విశేషం. ప్రాజెక్ట్ మొత్తం రిజల్ట్ ను చివరి రోజున పరిశీలిస్తామన్నారు సోమనాధ్.

ఇంకా రేపటి నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ చేయనున్న ఆదిత్య L 1 కూడా సక్సెస్ అవుతుందని నమ్మకాన్ని తెలియచేశారు సోమనాధ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version