ఆదిత్య ఎల్ 1 ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో అధికారులు

-

సూర్యుడిపై పరిశోధనలకు సిద్ధమవుతోన్న ఆదిత్య ఎల్ 1 ప్రయోగానికి సిద్దమయ్యింది. ఈ ప్రయోగానికి ఇస్రో అధికారులు రిహార్సల్స్ కూడా పూర్తి చేశారు. పిఎస్ఎల్వీ-సి 57 ఆదిత్య ఎల్ 1 మిషన్ ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయని… లాంచ్ రిహార్సల్ – వెహికల్ అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయని ఇస్రో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆదిత్య-ఎల్1 మిషన్ సూర్యుని అధ్యయనం చేసే లక్ష్యంతో ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి సోలార్ మిషన్. ఆదిత్య ఎల్ 1 మిషన్ ను 2023, సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11 గంటల 50 నిమిషాలకు.. ఆంధ్రప్రదేశ్ శ్రీహరి కోట నుంచి ప్రయోగించనుంది ఇస్రో. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనున్నారు శాస్త్రవేత్తలు.

సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపడుతోంది ఇస్రో. దీనిని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజ్ పాయింట్-1 (ఎల్ -1)దగ్గర ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. ఎల్‌-1 పాయింట్‌లో శాటిలైట్‌ను నిల‌ప‌డం వ‌ల్ల‌.. సూర్యుడిని నిరంత‌రం చూసే అవ‌కాశం ఉంటుంద‌ని ఇస్రో ఓ ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది. ఈ ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టి సూర్యుడి పుట్టుక,అక్కడి వాతావరణం, సౌర తుఫానులపై అధ్యయనం చేయవచ్చు. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు ఒక అంచనా వేశారు. దీంతోపాటు కాంతిమండలం(ఫొటోస్పియర్),వర్ణమండలం(క్రోమోస్పియర్)పై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించాలని ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news