నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్‌-29

-

isro launched Advanced communication satellite gsat 29

సమాచార వ్యవస్థకు ఊతమిచ్చే జీశాట్‌-29 భారీ ఉపగ్రహాన్ని జీఎస్ ఎల్వీ-మార్క్‌3 డీ2 రాకెట్‌ ద్వారా రోదసిలోకి పంపారు. రాకెట్‌ బరువు 640 టన్నులు కాగా, ఉపగ్రహం బరువు 3,423 కిలోలు. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళుతోంది. అంతా సవ్యంగా ఉంటే.. 16.43 నిమిషాలలో భూమికి 207కి.మీ. ఎత్తుకు చేరుకుని జీశాట్‌-29 ఉపగ్రహాన్ని వదిలిపెడుతుంది.

ఇవీ ఉపయోగాలు!
జమ్ము-కశ్మీర్‌, ఉత్తర, ఈశాన్య భారత భూ భాగాలలో ఈ ఉపగ్రహం సేవలు అందించనుంది. కశ్మీర్‌ లోయలో ఇంటర్నెట్‌ ప్రసారాలకు ఊతం ఇస్తుంది. మొత్తం పదేళ్లపాటు ఉపగ్రహం పనిచేసేలా రూపొందించారు. బెంగుళూరులోని ఇస్రో శాటిలైట్‌ సెంటర్‌, అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ సంయుక్తంగా ఉపగ్రహాన్ని రూపొందించాయి.

Read more RELATED
Recommended to you

Latest news