మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేసారా? మీరూ మోసం చేయాలనుకుంటున్నారా? ఇది తెలుసుకోండి.

-

మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలిసి మీరు కూడా మోసం చేయాలన్న ఆలోచన కలుగుతుంది. దాని ద్వారా అవతలి వారికి కోపం తెప్పించాలని అనుకుంటారు. ఈ ఆలోచన మనసుకు తృప్తి ఇస్తుంది. కానీ దీనివల్ల మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మానసికంగా ఎన్నో కోల్పోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతీకార మోసం వల్ల కలిగే ఇబ్బందులేమిటో తెలుసుకుందాం.

అవతలి వారు టేకిట్ ఈజీగా తీసుకుంటారు.

వారు మోసం చేసారు. మీరు కూడా చేస్తున్నారు. ఆ విషయం వారికి తెలిసినపుడు నువ్వు చేసావు, నేను చేసాను. లెక్క సరిపోయిందని, వారు చేసిన దాన్ని తప్పుగా పరిగణించరు. దానివల్ల మీకు కూడా ఇబ్బందే.

మీ మీద మీకు కోపం పెరుగుతుంది

ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నప్పుడు అవతలి వారి మీద కోపం పెరుగుతుంది. దానికన్నా ముందు నేనెలా మోసపోయాననే ఆలోచన వస్తుంది. అది మిమ్మల్ని ఇంకా దహించి వేస్తుంది. కోపం ఎల్లవేళలా మంచిది కాదు. అది మీకే నష్టాన్ని కలిగిస్తుంది.

వాళ్ళను గాయపర్చడం కంటే మీరే ఎక్కువ గాయపడతారు

ప్రతీకారం మీ గాయాన్ని తగ్గించదు. తగ్గించినా కొంతకాలం వరకే. ఆ తర్వాత మళ్ళీ గాయం నొప్పి పెడుతూనే ఉంటుంది. దానివల్ల మానసిక ప్రశాంతత కోల్పోవాల్సి వస్తుంది. అదీగాక మీరు కూడా మోసం చేస్తున్నారని తెలిసినపుడు అవతలి వారు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. అది మిమ్మల్ని ఇంకా ఇబ్బందికి గురి చేయగలదు.

మళ్ళీ కలిసి నడిచే అవకాశాలను తగ్గిస్తుంది.

ఇద్దరు మోసం చేసుకుంటున్నప్పుడు మళ్ళీ వారిద్దరు కలిసి నమ్మకంగా ఉండడం అసాధ్యం. ఏదో కలిసి ఉంటున్నారన్న పేరు తప్ప ఏమీ ఉండదు. ఎలాంటి ఎమోషన్ లేని ఒక బంధంలో ఇరుక్కుపోవడం కన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. అందుకే మీ భాగస్వామి మోసం చేస్తున్నారని తెలిసినపుడు వారితో విడిపోవడమో, క్షమించడమో చేస్తేనే బెటర్.

Read more RELATED
Recommended to you

Latest news