మన దేశంలో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి..వాటిలో కొన్నింటికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.అలాంటి ఆలయాల్లో ఒకటి రాయ్‌బరేలీ జిల్లాలోని లాల్‌గంజ్ ప్రాంతంలో ప్రసిద్ధ బాలేశ్వర్ ఆలయం ఉంది.ఈ ఆలయం సుమారు 600 ఏళ్ల చరిత్ర కలిగినది..ఒకప్పుడు ఈ ప్రదేశంలో అడవి ఉండేదని స్థానికుల కథనం.
బల్హేమావు గ్రామానికి చెందిన తివారీ కుటుంబానికి చెందిన ఆవు గొర్రెల కాపరితో కలిసి అడవికి మేతకు వెళ్లేది. అకస్మాత్తుగా ఆవు పాలు ఇవ్వడం మానేసింది.. దీనికి కారణం గొర్రెల కాపరి ఆవు పాలను దొంగిలించి ఉంటాడని ఆవు యజమాని అనుమానించాడు. అందుకే ఆవు పాలు ఇవ్వడం లేదని భావించి గొర్రెల కాపరి దొంగతనాన్ని బయట పెట్టాలని యజమాని చాటుగా వెళ్ళాడు.
అతడు చూస్తుండగా ఆవు ఒక పొదలొకి వెళ్ళింది.తన పొదుగు నుండి పాలు ఇస్తోంది. ఇది పొదల వెనుక నుండి యజమాని చూశాడు. భూమి నుంచి గుంతలోకి పాల ప్రవాహం వెళుతోంది. ఆవు యజమాని తన కళ్లతో చూసిన నిజాన్ని కూడా నమ్మలేకపోయాడు.అతనికి కలలో శివయ్య దర్శనం ఇచ్చాడు. నువ్వు ఆవును చూసిన చోటనే నేను ఉన్నానని శివుడు అతని కలలో చెప్పాడు. విగ్రహ పూజ కోసం ఒక ఆలయాన్ని ఏర్పాటు చేయమని సూచించాడు. దీంతో మరుసటి రోజు ఉదయం ఆవు యజమాని అతనికి వచ్చిన కల గురించి కుటుంబ సభ్యులకు చెప్పాడు. అనంతరం ఆ స్థలంలో తవ్వకాలు చేపట్టారు. త్రవ్వకాలలో అతనికి ఒక శివలింగం దొరికింది. ఆ తర్వాత అక్కడ బాలేశ్వరాలయం ఆలయాన్ని నిర్మించారు..
అక్కడకు వచ్చిన భక్తులు శ్రద్దలతో శివయ్యను పూజించి,కోరుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.జనవరిలో బలేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. జనవరి 1న ఇక్కడ భారీ జాతర జరుగుతుంది. ప్రజలు ముందుగా లాల్‌గంజ్‌లోని భైరోన్ ఆలయానికి చేరుకుంటారు. అక్కడి నుండి యాత్రను ప్రారంభిస్తారు. యాత్రకు వెళ్లే ప్రజల కోసం భండారా కూడా ఏర్పాటు చేస్తారు. అదే సమయంలో ఆలయ ప్రాంగణంలో భండారా కూడా నిర్వహిస్తారు..శ్రావణ మాసంలోని రెండొవ సోమవారం ప్రత్యేక అలంకరణ చేస్తారు.అలాగే పూజలు చేస్తారు.ఇక్కడకు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు..