ద్రాక్ష పళ్లను ఎక్కువ తినడం మంచిది కాదట.. ఈ సమస్యలు రాక తప్పదు..!

-

ద్రాక్ష పళ్లు భలే తినటానికి పుల్లపుల్లగా, తియ్యగా టేస్టీగా ఉంటాయి. ఎదురుగా పెడితే..ఎన్ని తిన్నామన్నా లెక్కలేకుండా తినేస్తుంటాం. అవి ఎక్కువ తిన్నా కడుపు వెంటనే నిండిన ఫీల్ ఉండదు. ఇక వీటిల్లో కలర్స్, సీడ్ లెస్ కూడా ఉన్నాయి..విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ద్రాక్షలో పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ ద్రాక్ష వల్ల అనేక దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి తెలుసా..

స్టైల్ క్రేజ్ కథనం ప్రకారం.. ద్రాక్ష పండ్ల అధికంగా తినటం వల్ల కలిగే దుష్ప్రయోజనాలేంటో చూద్దాం.

ద్రాక్షలో సహజంగానే చక్కెర ఎక్కువగా ఉంటుంది. అందుకే ద్రాక్ష ఎక్కువగా తింటే విరేచనాలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే కడుపు నొప్పి ఉన్నట్లయితే..

మూత్రపిండవ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారు ద్రాక్ష తినకూడదు. ద్రాక్షను అధికంగా తీసుకోవడం వల్ల అనేక రకాల కిడ్నీ సంబంధిత సమస్యలు మరింత పెరుగుతాయట. అలాగే ద్రాక్షను ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి.

మీరు సన్నబడాలనుకుంటే.. అలాంటప్పుడు ద్రాక్ష తినకూడదు. ద్రాక్ష పండ్లను తినడం వల్ల శరీరానికి ఎక్కువ కేలరీలు అందుతాయి. ద్రాక్షలో కేలరీల పరిమాణం చాలా ఎక్కువ. ప్రోటీన్, కొవ్వు, ఫైబర్, కాపర్ మరియు విటమిన్-కె, థయామిన్ కూడా ద్రాక్షలో పుష్కలంగా ఉంటాయి.. అందుకే ఎక్కువ ద్రాక్ష తినడం వల్ల శరీర బరువు పెరుగుతుంది.

ద్రాక్షలో బలమైన పాలీఫెనాల్స్ ఉన్నాయి. ఇవి రెడ్ వైన్‌లో కూడా కనిపిస్తాయి. వీటి వల్ల పుట్టబోయే బిడ్డలో ప్యాంక్రియాటిక్ సమస్యలు కనిపిస్తాయి. అందువల్ల గర్భధారణ సమయంలో ద్రాక్షను తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి… డాక్టర్‌ని సంప్రదించాకే తినడం మంచిది.

చేతులు, కాళ్ళలో అలెర్జీ సమస్యలను కూడా వస్తాయట. ద్రాక్షలో లిక్విడ్ ప్రోటీన్ ట్రాన్స్‌ఫేరేస్ ఉంటుంది. ఇది అలెర్జీ ఇబ్బందులకు కారణమవుతుంది. దురద, దద్దుర్లు, నోటి వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ద్రాక్ష అనాఫిలాక్సిస్‌కు కూడా కారణమవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. అందుకే ద్రాక్ష విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తియ్యతియ్యగా పుల్లపుల్లగా ఉన్నాయని ఎక్కువగా తినొద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news