ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రోపీను కైవసం చేసుకుంది. కానీ ఈ టోర్నీలో అద్భుతంగా రాణించి పరుగుల వరద పారించిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్ మాన్ గిల్ ను మాత్రం ఎవ్వరూ మరిచిపోలేరు. ఈ ఐపీఎల్ లో గిల్ మూడు సెంచరీలు చేసి సీనియర్ క్రికెటర్ లు సైతం ముక్కున వేలేసుకునేలా ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శన చూసిన ప్రపంచ మాజీ క్రికెటర్లు అప్పుడే ఇతన్ని సచిన్ అని కోహ్లీ అని పోల్చుతూ ఆక్సానాయికి ఎత్తేస్తున్నారు. ఈ పొగడ్తలపై గుజరాత్ టైటాన్స్ కోచ్ గ్యారీ క్రిస్టెన్ స్పందించాడు.