బెంగళూర్ – హౌరా ట్రైన్ లో ఏపీ ప్రయాణికుల వివరాలు ఇవే…

-

ఒడిశా రాష్ట్రం బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ఈ ప్రమాదానికి గురైన మూడు ట్రైన్ లలో బెంగుళూరు నుండి హౌరా వెళ్తున్న ట్రైన్ కూడా ఒకటి. ఇందులో ప్రయాణించిన ఆంధ్రప్రదెష్ష్ రాష్ట్రం వారి వివరాలు ఇప్పుడే వచ్చాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ట్రైన్ లో ప్రయాణం చేయడానికి మొత్తం 89 మంది ఏపీ ప్రజలు రిజర్వేషన్ ను చేయించుకున్నారు. కాగా ఇందులో 79 మంది మాత్రం ట్రైన్ లో ప్రయాణించగా, ఒక పది మంది ట్రైన్ ను ఎక్కలేదని తెలుస్తోంది. ఇక ప్రయాణించిన వారిలో 49 మంది సురక్షితంగా బయటపడగా ఇద్దరికి మాత్రమే గాయాలు అయ్యాయట… ఇంకా 29 మంది ఆచూకీ తెలియలేదు.

 

వీరి కోసం ఇంకా రక్షణ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి వారు బ్రతికే ఉన్నారా ? లేదా సురక్షితంగా బయటపడి ఎక్కడైనా ఉన్నారా అంది ఇంకా తెలియలేదు. దీనితో ఆ కుంటుంబ సభ్యులు బాధలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news