పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ నుండి సస్పెండ్ చేయడం పై స్పందించారు మాజీ ఎంపీ పొంగులేటి.. తనని బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జనవరి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని.. 100 రోజుల తర్వాత అయినా బిఆర్ఎస్ నేతలు ధైర్యం తెచ్చుకొని తనని సస్పెండ్ చేశారని ఎద్దేవా చేశారు.
పార్టీలో సముచిత స్థానం ఇస్తామంటేనే.. సీఎం మాటలు నమ్మి టిఆర్ఎస్ పార్టీలో చేరానని అన్నారు. పార్టీలో సముచిత స్థానం కల్పించకపోయినప్పటికీ కేటీఆర్ మాటలు నమ్మి ఇన్నాళ్లుగా ఆ పార్టీలో కొనసాగానని చెప్పుకొచ్చారు పొంగులేటి. దొరల గడీల నుంచి విముక్తి లభించినందుకు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.