వాట్సప్‌ స్టేటస్‌ డౌన్‌లోడ్‌ చేయడం చాలా ఈజీ!

-

మీకు ఇతర వాట్సాప్‌ స్టేటస్‌లోని ఫోటోస్‌ లేదా వీడియో మీకు నచ్చాయా? మీరు వాటిని డౌన్‌లోడ్‌ చేయాలనుకుంటున్నారా? ఇతరు వాట్సాప్‌ స్టేటస్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం చాలా సులభం. అది ఎలాగో తెలుసుకుందాం. వాట్సప్‌లో అద్భుతమైన ఫీచర్స్‌లో ఒకటి స్టేటస్‌ ఫీచర్‌. వాట్సప్‌ యూజర్లలో స్టేటస్‌ ఫీచర్‌కు ఎక్కువ క్రేజ్‌ ఉంది. ఫోటోలు, వీడియోలు, గిఫ్‌ ఫైల్స్‌ స్టేటస్‌గా పెట్టడం అలవాటుగా మారింది. రోజూ స్టేటస్‌ అప్‌డేట్‌ చేస్తూ ఉంటారు. ఇక స్టేటస్‌ అప్‌డేట్‌ చేయకపోయినా, తమ కాంటాక్ట్స్‌లో ఉన్నవారి స్టేటస్‌లు చూసేవారు ఉంటారు. వాట్సప్‌ స్టేటస్‌లల్లో ఫోటోలు, వీడియోలు ఒక్కోసారి ఆకట్టుకుంటాయి. తాము కూడా ఆ స్టేటస్‌ పెట్టాలని అనుకుంటారు. అటువంటి స్టేటస్‌ సింపుల్‌గా డౌన్‌ లోడ్‌ చేయొచ్చు. ఇతరుల స్టేటస్‌లో ఉండే ఫోటోలు, వీడియోలు, గిఫ్‌ ఫైల్స్‌ చాలా సింపుల్‌గా డౌన్‌లోడ్‌ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

దీనికి ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌ లో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి గూగుల్‌ ఫైల్స్‌ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేయాలి. చాలా స్మార్ట్‌ఫోన్లలో ఈ యాప్‌ డిఫాల్ట్‌గా ఉంటుంది.గూగుల్‌ ఫైల్స్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసిన తర్వాత కార్నర్‌లోని త్రీ లైన్‌ క్లిక్‌ చేయాలి. అందులో సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయాలి.‘షో హిడెన్‌ ఫైల్స్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఎనేబుల్‌ చేయాలి. ఆ తర్వాత మళ్లీ గూగుల్‌ ఫైల్స్‌ యాప్‌ ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌ ఎంపిక చేయాలి. అందులో వాట్సాప్‌ ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత మీడియా ఫోల్డర్‌ ఓపెన్‌ చేయాలి. అందులో స్టేటస్‌ ఫోల్డర్‌ కనిపిస్తుంది. అది ఓపెన్‌ చేస్తే మీరు ఇప్పటి వరకు చూసిన స్టేటస్‌ ఫైల్స్‌ కనిపిస్తాయి. వాట్సప్‌ స్టేటస్‌ ఫోల్డర్‌ హిడెన్‌ మోడ్‌లో ఉంటుంది. అంటే ఆ ఫోల్డర్‌ ఇతర ఫైల్‌ మేనేజర్‌ యాప్స్‌లో కనిపించదు హిడెన్‌ ఫైల్స్‌ ఆప్షన్‌ సెలెక్ట్‌ చేస్తేనే ఆ ఫోల్డర్‌ కనిపిస్తుంది. మీరు స్టేటస్‌లో చూసే ప్రతీ ఫోటో, వీడియో ఈ ఫోల్డర్‌లో సేవ్‌ అయి ఉంటుంది. ఆ ఫైల్‌ని మీరు షేర్‌ చేయొచ్చు. లేదా స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news