మకర సంక్రాంతి రోజు ఇవి దానం చేయడం ఎంతో మేలు..పొరపాటున కూడా ఇలా చేయొద్దు..!

-

మకర సంక్రాంతికి హిందూ సంప్రదాయాల్లో ప్రత్యక స్థానం ఉంది. సంవత్సరంలో వచ్చే తొలిపండుగ ఇది. అనేక ప్రాంతాల్లో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుతారు. మఖ్యంగా ఈ పండుగరోజు సూర్యభగవానుడు, శనిదేవుడని పూజిస్తారు. ఆరోజు గంగాస్నానం, కథ, దానధర్మాలు, ఉపవాసం ఉండటం వల్ల ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయని అందరి విశ్వాసం. ఈ పండుగ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదో ఇప్పుడు చూద్దాం.

ఈ పండుగ రోజు నువ్వులతో చేసిన వస్తువులను తప్పనిసరిగా దానం చేయాలి. అంతే కాదు 14 వస్తువులను దానం చేస్తే చాలా మంచిదని పండితులు అంటున్నారు.. ఈ రోజున చేసిన దానాల ఫలాలు మిగిలిన రోజుల కంటే చాలా రెట్లు మంచిని చేకూరుస్తాయి. ఇది మాత్రమే కాదు ఖరీఫ్ పంటలైన వరి, శనగ, వేరుశెనగ, బెల్లం, నువ్వులతో చేసిన పదార్థాలను సూర్య భగవానుడు శని దేవుడికి నైవేద్యంగా పెడుతారు.

ఈ రోజున నదీస్నానం చేయడం శుభప్రదంగా భావించినప్పటికీ అది కుదరకపోతే ఇంట్లో నల్ల నువ్వులను నీటిలో వేసి స్నానం చేయవచ్చు… ఈ పండుగకి శని దేవుడిని ప్రసన్నం చేసుకుంటే చాలా మంచిదని భావిస్తారు. నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా మీరు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.
ఈ రోజు నువ్వులు కలిపిన నీరు తాగాలి. అలాగే నువ్వుల లడ్డూలు తినడం శుభప్రదంగా భావిస్తారు.
మకర సంక్రాంతి రోజున కిచిడీ తినడం చాలా శ్రేయస్కరం. ఉపవాసం తర్వాత మీరు కిచిడీని ప్రసాదంగా తింటే మంచిది.

సంక్రాంతి పండగరోజు చేయకూడని పనులు..

ఈ రోజున దాన, ధర్మాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఒక బిచ్చగాడు లేదా పేదవాడు ఏదైనా అడగడానికి మీ ఇంటికి వస్తే పొరపాటున కూడా అతనిని ఖాళీ చేతులతో పంపవద్దు…అతనికి ఆహారం, తినుబండారాలు, ఇతర వస్తువులను ఇచ్చి పంపిస్తే మీకు శుభం కలుగుతుంది.

హిందూ మతంలో ఈ రోజును పవిత్రమైనదిగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున మత్తుకు దూరంగా ఉండాలి. మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం అశుభం.

ఉపవాసం ఉండేవారు ప్రతి నియమాన్ని పాటించాలి. ఉపవాసం లేనివారు పూజలను విశ్వసించే వారు కూడా కొన్ని నియమాలను పాటించాలి. స్నానానికి, పూజకు ముందు ఏ విధమైన ఆహారం తినకూడదు.

ఇవన్నీ నమ్మనివాళ్లు కూడా ఉంటారు. కానీ కొందరు వీటిపై ఆసక్తిగా ఉంటారు. ప్రతినియమాన్ని పాటిస్తారు. అలాంటివారికోసమే పండితులు చెప్పినదానిని ఆధారంగా ఈ కథనం అందించటం జరిగింది. వీటికి సైంటిఫిక్ ఆధారాలు అంటూ లేవు. ఇష్టం ఉంటే ఫాలో అవ్వడం లేదంటే..లైట్ తీసుకుని లాగించేయడం అంతే.

Read more RELATED
Recommended to you

Latest news