ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ఒక నియంత. అగ్ర రాజ్యం అమెరికాతో కయ్యానికి కాలు దువ్వె కిమ్ ఏ దేశం మాట కూడా వినే పరిస్థితి ఉండదు. అణ్వాయుధ ప్రయోగాలు చేస్తూ కిమ్ దూకుడు ప్రదర్శిస్తూ ప్రపంచాన్ని భయపెడుతూ ఉంటారు. ఆయనతో చర్చలు జరపడానికి చాలా మంది ప్రయత్నాలు చేసినా ఆయన మాత్రం అమెరికాకు షరతులు పెడుతూ ఉంటారు.
అలాంటి వ్యక్తి ఇప్పుడు భయపడ్డాడు. ఏకంగా అమెరికాకు భయపడి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. గత శుక్రవారం ఇరాన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమానిపై అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో హతం కావడంతో కిమ్ లో భయం మొదలైందని అంటున్నారు. ఈ దెబ్బతో ఆయన గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కొరియా మీడియా కూడా తమ దేశాధినేత ఎక్కడ ఉన్నారు అనేది చెప్పడం లేదు. డిసెంబర్ 31న ఆయన వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ సెషన్ ముగిసిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ పై విమర్శలు చేసారు. అప్పటి నుంచి ఆయన ఆచూకి కూడా తెలియడం లేదు. ఎప్పుడు ఏదోక రూపంలో వార్తల్లో ఉండే ఆయన ఇప్పుడు ఆ వార్తలకు కూడా కనీసం దొరకడం లేదు. ఏది ఎలా ఉన్నా కిమ్ భయపడటం మాత్రం ఇప్పుడు సంచలనమే. తనపై దాడి చేస్తారనే భయం కిమ్ లో నెలకొందని అంటున్నారు.