ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకం ఇప్పుడు లబ్దిదారులను ఇబ్బంది పెడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కోసం భారీగా లబ్ది దారులు అప్లయ్ చేసుకుంటున్నారు. ఇన్నాళ్ళు ప్రభుత్వ నిభంధనల విషయంలో స్పష్టత రాని లబ్దిదారులకు, ఇప్పుడు వాటి విషయంలో స్పష్టత రావడం 75 శాతం హాజరు మినహాయింపు ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడంతో,
లబ్ది దారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో పథకం కోసం లబ్ది దారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆదిలోనే అఇబ్బందులు తలెత్తుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అమ్మఒడి పథకం కోసం అప్లై చేసుకొవడానికి సంబంధించిన సైట్ మూత పడటంతో… వందలో సంఖ్యలో విద్యార్థులు తమ వివరాల్ని అప్‌లోడ్‌కు చేసుకోలేకపోయినట్టు తెలుస్తుంది.
అమ్మఒడి మూడోజాబితా (ఫారం-3) చేర్చిన విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించి మరో దఫా అప్‌లోడ్ చేయడానికి అమ్మఒడి సైట్ సోమవారం ఉదయం మూసేయడంతో లబ్ది దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా పలువురి ధ్రువపత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉండగా సైట్‌ను మూసివేయడంతో సాధ్యం కాలేదని విద్యాధికారులు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. మూడో జాబితాకు సంబంధించి తమకు కాస్త సమయం కావాలని కోరుతున్నారు.