Ramky : వైసీపీ ఎంపీ కంపెనీపై ఐటీ దాడులు… రూ. 300 కోట్ల స్కాం !

-

రాంకీ కంపెనీపై ఐటీ దాడులు చేసింది. అయితే.. రాంకీ సంస్థలో జరిగిన జరిగిన సోదాలపై ఐటీ  కీలక ప్రకటన చేసింది. వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఈ సంస్థకు చైర్మన్ గా కొనసాగుతున్నారు. రాంకీ సంస్థ ఉద్దేశపూర్వకంగానే నష్టాలను చూపిందని.. ఐటి స్పష్టం చేసింది. 1200 కోట్ల రూపాయల కుత్రిమ నష్టాన్ని రాంకీ సంస్థ చూపెట్టిందని ఐటీ ప్రకటనలో వెల్లడించింది.

రాంకీ లోని మేజర్ వాటాను సింగపూర్ చెందిన వ్యక్తులకు అమ్మేశారని..అలాగే తప్పుడు లెక్కలు చూపెట్టి 300 కోట్ల రూపాయల టాక్స్ ఎగ్గొట్టేందుకు ప్రయత్నం చేశారని స్పష్టం చేసింది ఐటీ. అంతేకాదు 288 కోట్ల రూపాయలు సంబంధించిన పత్రాలను సంస్థ నాశనం చేసిందని.. రాంకీ సంస్థ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ తో పాటు వేస్ట్ మేనేజ్మెంట్ వాటిలో ప్రాజెక్ట్ చేపట్టిందని ప్రకటనలో తెలిపింది ఐటీ. 300 కోట్ల రూపాయల లెక్కలేని డబ్బుల లావా దేవీలను కొనుక్కున్నారని ఐటీ పేర్కొంది. కాగా గత మూడు రోజుల నుంచి.. రాంకీ కంపెనీపై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news