భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ధరించే జెర్సీ నెంబర్ ఎంత అనగానే సగటు క్రికెట్ అభిమాని టక్కున 7 అని చెప్తారు. భారత క్రికెట్లో ఎంఎస్ ధోనికి, జెర్సీ-7కు ఉన్న ప్రాధన్యం అలాంటిది.కాగా ధోని ధరించిన జెర్సీని మరెవరికి ఇవ్వొద్దని… ఆ జెర్సీకి వీడ్కోలు పలకాలని టీమిండియా మాజీ ఆటగాడు సాబా కరీమ్ అన్నారు. టీమిండియాకు సేవలదించిన మరికొంత మంది దిగ్గజాల జెర్సీలను కూడా అలానే అలాగే భద్రపరచాలని కరీమ్ సూచించారు. ఇలా వారు ధరించిన జెర్సీ నంబర్లను ఇతరులు వాడకుండా చూడాలన్న కరీమ్… భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లిన దిగ్గజాలకు ఇదో గుర్తింపు అని అన్నారు. దిగ్గజాలను ఇలా గౌరవించొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసారు.
ఈ సందర్భంగా కరీమ్ ధోనిపై ప్రశంసలు కురిపించారు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనప్పటికీ యువకులకు మార్గనిర్దేశం చేయగలడని అన్నాడు. మహీ భారత క్రికెట్‌కు సేవలు కొనసాగిస్తాడని అనుకుంటున్నట్లు చెప్పారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ధోని ఎంతో మంది యువకులను తీర్చిదిద్దాడని పేర్కొనారు. ధోని రాష్ట్ర స్థాయిలోనూ కుర్రాళ్లకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. అలాగైతే భారత క్రికెట్ భవిష్యత్తుకు మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.