స్టార్ హీరో విజయ్ ఇంట్లో సోదాలు ఐటి సోదాలు..!!

-

తమిళనాడు రాష్ట్రంలో ఆదాయపు పన్ను అధికారులు వరుసగా రెండు రోజుల నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో నటుడు విజయ్ ఇంట్లో, ఏజీఎల్ కార్యాలయాల్లో సోదాలు చేశారు. జరిగిన ఈ దాడుల్లో  దాదాపు 65 కోట్ల వరకూ డబ్బులు రికవరీ చేసినట్లు సమాచారం.

గత ఏడాది విడుదలైన ‘బిగిల్’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకి సంబంధించి పారితోషికం విషయంలో నటుడు విజయ్ ని ఆదాయపు పన్ను అధికారులు అనేక ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఇదే తరుణంలో ఆ చిత్ర నిర్మాత ఇంటిలో మరియు కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను అధికారులు పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

 

నటుడు విజయ్ కి చెందిన స్థానిక సాలిగ్రామంలోని ఇంటిలో, నీలాంగరై, కానాత్తుర్‌లోని ఆయనకు చెందిన మరో రెండు ఇళ్లల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. దాదాపు లెక్కల్లో లేని 24 కోట్లు పట్టుబడినట్లు అంతే కాకుండా పెద్ద మొత్తంలో బంగారం కూడా ఈ దాడుల్లో దొరికినట్లు తమిళ మీడియా వర్గాల్లో ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news