3 రోజుల తర్వాత టాలీవుడ్ సెలబ్రీటీలకు రిలీఫ్ దక్కింది.. సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు ముగిశాయి. అర్ధరాత్రి అన్నిచోట్ల ఐటీ సోదాలు ముగిసాయి. మూడు రోజులపాటు 16 చోట్ల సోదాలు నిర్వహించారు ఐటి అధికారులు. 55 టీం లతో సినీ నిర్మాతలు డైరెక్టర్ లపై సోదాలు నిర్వహించింది ఐటీ. సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతని టార్గెట్ గా సోదాలు చేశారు. పుష్ప 2 సినిమా కలెక్షన్స్ వ్యవహారంపై సోదాలు నిర్వహించారు.
పుష్ప 2 సినిమా నిర్మాతలు డైరెక్టర్ ఇంటిలో సోదాలు చేసింది ఐటి. డైరెక్టర్ సుకుమార్ ఇంటిలో సోదాలు నిర్వహించిన ఐటీ.. ప్రముఖ కంటెంట్ సంస్థ మ్యాంగో పైన సోదాలు కొనసాగాయి. ప్రముఖ ఫైనాన్స్ సంస్థ సత్య రంగయ్య ఇంట్లో సైతం సోదాలు చేశారు. ఫైనాన్సర్ నిర్మాత నెక్కింటి శ్రీధర్ ఇంటిలో కూడా సోదాలు జరిగాయి. నెల్లూరు ప్రతాపరెడ్డి ఇంట్లో రెండు రోజులు నిర్వహించింది ఐటీ. ఎన్నారై నిధులను సమకూర్చడంలో నెల్లూరు ప్రతాప్ రెడ్డి కీలకం. ఐటి సోదాలు భారీగా నిధుల గోల్మాల్ గుర్తించారట.