టాలీవుడ్ హీరోయిన్ హన్సిక గత ఏడాది డిసెంబర్ 4న తన చిరకాల స్నేహితుడు సోహెల్ తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఈ జంట ప్రస్తుతం చాలా ఆనందంగా గడుపుతున్నారు. అయితే తాజాగా హన్సిక తన మొదటి ప్రేమ, బ్రేకప్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది..
తాజాగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హన్సిక తను మొదటి ప్రేమ, విడిపోవడం గురించి పలు విషయాలు తెలిపింది. అంతే కాకుండా సోహెల్ తో పరిచయం ఎలా జరిగిందో చెప్పుకొచ్చింది.. హన్సిక గతంలో శింబుతో ప్రేమలో ఉందంటూ వచ్చిన వార్తలు అందరికీ తెలిసిందే.. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్న సమయంలో శింబు తండ్రి నా కొడుకు ఎవరిని పెళ్లి చేసుకున్న నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అది హన్సిక అయిన పర్వాలేదు.. అంటూ వీరి ప్రేమ విషయాన్ని బయట పెట్టేశారు. కానీ కొన్నాళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు..
అయితే ఈ విషయంలో స్పందించిన హన్సిక.. “నాకు బ్రేకప్ నుంచి బయట పడటానికి చాలా సంవత్సరాలు పట్టింది. మరొకరికి ఒకే అని చెప్పడానికి. బ్రేకప్ తర్వాత కోలుకుని కొత్త వ్యక్తి ప్రేమను అంగీకరించేందుకు కనీసం 7, 8 సంవత్సరాలు పట్టింది. ఆ రోజుల్లో నరకం చూసాను.. నాకు ప్రేమపై నమ్మకం ఉంది. కానీ నేను రొమాంటిక్ వ్యక్తిని.. అయితే రొమాంటిక్ పర్సన్ గా చాలా ఎక్స్ ప్రెసివ్ కాదు. మనసులోని భావాలను త్వరగా బయటపెట్టలేను. నేను వివాహ వ్యవస్థను నమ్ముతాను. ప్రేమను విశ్వసిస్తాను. నిజం చెప్పాలంటే నాతో భవిష్యత్తులో ఉండబోయే వ్యక్తి గురించి నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయం తీసుకున్నాను. సోహెల్ ప్రేమను నేను ఎక్కువగా నమ్ముతాను. అతను నా ప్రేమ కోసం ఎదురుచూశారు. దేవుడు మాకు కొత్త దారి చూపించాడు…” అంటూ చెప్పుకొచ్చింది.
అయితే మొదటి ప్రేమ తనకు ప్రేమ రుచిని చూపించలేదని, తనకు ఎలాంటి పాఠాలు నేర్పలేదని చెప్పుకొచ్చింది హన్సిక.. ముగిసిపోయిన బంధం గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని కొత్త బంధాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ప్రతి సంబంధానికి దాని సొంత మార్గం ఉంటుందని కచ్చితంగా నేను విశ్వసిస్తాను అంటూ తెలిపింది..