మోదీ సాధించిన అద్భుత విజయాలు ఇవే: రాహుల్ గాంధీ..!

-

ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. కరోనా కష్టకాలంలో ప్రధాని మోదీ సాధించిన అద్భుత విజయాలు ఇవేనంటూ ఆయన అందులో పేర్కొన్నారు. కరోనా కష్టాల్లో దేశం కొట్టుమిట్టాడుతుంటే ప్రధాని మోదీ మాత్రం రాజకీయాలు, ఇతర కార్యక్రమాలపై దృష్టిపెట్టారంటూ సెటైరికల్‌గా ఆ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ వైఫల్యం వల్లే కరోనా విజృంభణలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందని విరుచుకుపడ్డారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై రాహుల్‌ గాంధీ గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ట్విటర్ ద్వారా విమర్శలు కురిపిస్తున్నారు. ఐతే రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందంటూ ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news