ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కెసిఆర్ జనగాం పర్యటనకు బదులుగా బీహార్ జైల్లో ఉన్న తన కూతురు కవితను పరామర్శిస్తే బాగుండేదని అన్నారు.కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జీ ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ పర్యటించిన పొలంలో వరుసగా నాలుగు బోర్లు వేయడం అనుమానంగా ఉందని,పక్కనే ఉన్న పంట పొలంలో బోరులో నీరు వస్తోందన్నారు.కాళేశ్వరం కుంగడం వల్లే నీరు దిగువకు విడుదల చేశారు. అందువల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు యశస్విని రెడ్డి.
హరీష్ రావు, కేసిఆర్,దయాకర్ రావు పదిరోజుల వ్యవధిలో ఒక పొలంలో పర్యటించారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లు ఎందుకు పూర్తి చేయలేదని ఆమె ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దయాకర్ రావు జైలుకు వెళ్లడం ఖాయమని ఆమె అన్నారు. కేసీఆర్ పర్యటన అంతా స్క్రిప్టెడ్.. కావాలనే నీటి రాజకీయాలు చేస్తున్నారు.. శాసనసభలో అడుగుపెట్టని కేసీఆర్ ఇక్కడికి రావడం విడ్డూరం అన్నారు. రైతులపై కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు.