ఎండిపోయిన పంటకు ఎకరానికి రూ.25వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. ‘రైతుల తరఫున మాట్లాడేవారు లేరనుకుంటున్నారా? మేమున్నాం అని ఆమె ఇచ్చారు. ప్రభుత్వం మెడలు వంచుతాం. లక్ష ఎకరాల్లో పంట పోయింది అని విమర్శించారు.. ఈ మంత్రులు, సీఎం ఏం చేస్తున్నారు? ఎండిపోయిన పంటకు ఎకరాకు రూ. 25వేల నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని అప్పటి వరకు వేటాడుతాం. వెంటాడుతాం. ఎక్కడికక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తాం’ అని హెచ్చరించారు.
తమ పార్టీ నేతలను కాంగ్రెస్, బీజేపీలో చేర్చుకోవడంపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కుక్కల్ని, నక్కల్ని గుంజుకుని మీరు ఆహా, ఓహో అనుకోవచ్చు . మా ఎమ్మెల్యేలను తీసుకోవడం చీప్ పాలిటిక్స్ అని ఆరోపించారు. రాజకీయాలు చేస్తూ పోతే ప్రజలు ఏం కావాలి? రాజకీయాలు చేయడానికి మేము రెడీ. చాలా మందిని పాతరేశాం’ అని అన్నారు.