గతకొన్ని రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం అతి తక్కువ టెస్టులు చేస్తుంది అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కరోనా టెస్టుల పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సంచార టెస్టింగ్ కేంద్రాలను కూడా ప్రారంభించింది. తాజాగా కోటి డిఎంఈ లో ఇంటిలిజెంట్ మానిటరింగ్ సర్వీసెస్ బస్సులను ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి వివరించారు.
ఒక రూపాయి ఖర్చు లేకుండానే 81 శాతం మంది కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నామని తెలిపిన ఈటల రాజేందర్… కేవలం 5 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్ సహా వైద్యుల నిరంతర పర్యవేక్షణ అవసరం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ సంచార టెస్టింగ్ బస్సుల ద్వారా… శరవేగంగా కరోనా పరీక్షలను నిర్వహించేందుకు వీలు ఉంటుందని… బస్సుల్లో 10 కౌంటర్లలో నమూనాలు సేకరించే వీలు ఉంటుందని అంటూ తెలిపారు. కరోనా పాజిటివ్ వ్యక్తుల ని గుర్తించడం ద్వారానే రాష్ట్రాల్లో కరోనా వైరస్ ను నియంత్రిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు ఈటల రాజేందర్.