Jabardast: రీ ఎంట్రీ ఇవ్వబోతున్న చమ్మక్ చంద్ర.. సక్సెస్ అయ్యేనా..?

-

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈ ప్రోగ్రాం 2013లో వచ్చి ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతోంది అంటే.. బుల్లితెర ప్రేక్షకులు ఈ షో ని ఎంతగా ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ షో కేవలం వినోదాన్ని పంచడమే కాదు ఎంతోమందికి టాలెంటును నిరూపించుకోవడానికి వేదిక అవుతుంది. అవకాశాల కోసం ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు కూడా జబర్దస్త్ లోకి వచ్చి కోటీశ్వరులైన విషయం తెలిసిందే. జబర్దస్త్ నీడ పొందిన చాలామంది ఆ తర్వాత వేరే చానల్స్ చూపించిన డబ్బుపై ఆశతో జబర్దస్త్ ను వీడివెళ్లిపోయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ జబర్దస్త్ విలువ తెలుసుకొని ఒక్కొక్కరిగా రీఎంట్రీ ఇస్తున్నారు.

ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న కమెడియన్ చమ్మక్ చంద్ర కూడా ఈ కార్యక్రమం నుంచి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. అయితే నాగబాబు వెళ్లిపోవడంతో ఆయన బాటలోనే ఈయన కూడా బయటకు వెళ్లిపోయారు. జబర్దస్త్ వీడిన తర్వాత కొంతకాలం పాటు ఇతర చానల్స్ లో సందడి చేసిన చంద్ర.. ప్రస్తుతం ఏ కార్యక్రమంలో కూడా కనిపించలేదు. మొన్నటివరకు ఈటీవీ స్పెషల్ ఈవెంట్లలో మాత్రమే సందడి చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా సమాచారం ప్రకారం.. చమ్మక్ చంద్ర జబర్దస్త్ సంప్రదింపులు జరిపారని త్వరలోనే ఆయన రీ ఎంట్రీ ఉండబోతుందని కూడా సమాచారం. ఇకపోతే జబర్దస్త్ చమ్మక్ చంద్ర టీం లో నటించిన సత్య శ్రీ కూడా ఇప్పటికే జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్ర కూడా జబర్దస్త్ కి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో చమ్మక్ చంద్ర కమెడియన్ గా మంచి గుర్తింపు పొందుతాడా? సక్సెస్ అవుతాడా? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news