లాక్ డౌన్.. పొలం పనుల్లో జబర్దస్త్ టీమ్ లీడర్

-

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్ డౌన్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో బుల్లితెర తారలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. టీవీలకు దూరమైనా సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. పలు రకాల వీడియోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లకు వినోదాన్ని పంచుతున్నారు. తాజాగా జబర్దస్ టీమ్ లీడర్ జీవన్.. పొలం పనులకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రైతుగా మారిన జీవన్.. వరి పంట కోత వడ్లు తూర్పార పట్టారు. చెమట కారుతున్న లెక్కచేయకుండా పనిలో నిమగ్నమైపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

కాగా, కేరీర్ ప్రారంభంలో కొన్ని చిన్న చిన్న షోలకు యాంకరింగ్ ప్రారంభించిన జీవన్.. ఆ తర్వాత జబర్దస్త్ చాన్స్ కొట్టేశాడు. ఈ షో ద్వారా బాగా పేరు తెచ్చుకున్న జీవన్.. తన మీద తానే పంచులు వేసుకుని జనాలకు వినోదాన్ని పంచుతున్నాడు. జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్‌పీ వంటి టీమ్ లీడర్స్ అదిరిందికి వెళ్లడంతో.. జీవన్‌కు టీమ్ లీడర్ అయ్యే అవకాశం వచ్చింది. తోటి కమెడియన్ మహీధర్‌తో కలిసి జిగేల్ జీవన్ మస్తీ మహీధర్ పేరుతో వీరి టీమ్ ఏర్పడింది.

వాస్తవానికి సంగీతం అంటే జీవన్‌కు చాలా ఇష్టమని చెబుతారు. పలు సందర్భాల్లో స్టేజ్ షోలలో కూడా ఆయన డప్పు చాలా బాగా వాయించారు. పలు ఈవెంట్లలో కూడా సింగర్ మంగ్లీతో కలిసి పాటలు పాడిన జీవన్ ప్రేక్షకులను అలరించారు.

Read more RELATED
Recommended to you

Latest news