ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అని.. ముట్టుకుంటే భస్మం అవుతారని మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాక్యలు చేశారు. కాళేశ్వరం కల సాకారం చేసిన నేత…సంక్షేమం, అభివృద్ధి లో సంచలనాలు సృష్టించిన నాయకుడు అంటూ ఓ రేంజ్ లో మెచ్చు కున్నారు. పైరవీలు,దందాలు చేసినోళ్లే ఊర కుక్కల్లా మొరుగుతున్నారని.. కేసీఆర్ మీద ,కుటుంబం మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని నిప్పులు చెరిగారు.
29 రాష్ట్రాలలో అతి చిన్న రాష్ట్రమని.. సంక్షేమం, అభివృద్ధి లో పరుగులు పెడుతున్న రాష్ట్రమని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే 24 గంటల విద్యుత్ ఉండేదా.. ఇంటింటికి మంచినీరు అందేదా అని నిలదీశారు. మోడీ పాలనలో దళారులు కుబేరులైనారు.. దేశం దివాళా తీసిందని.. కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేదంటూ చురకలు అంటించారు. పార్టీని నడిపే నాయకుడు ఎవరో వారికే తెలీదని.. సొంత పార్టీకి నాయకుడు ఎవరో వారికే తెలియదని తెలిపారు. అటువంటి పార్టీలు పేలుతున్న పిచ్చి ప్రేలాపనలను ప్రజలు గమనిస్తున్నారని.. మాదంతా పారదర్శకమేనంటూ పేర్కొన్నారు. మ్యానిఫెస్టోను ఉన్నది ఉన్నట్లు అమలు పరిచిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ అన్నారు.