గత కొద్దిరోజులుగా ఏపీలో ఒకటే హాట్ టాపిక్ అదే పోలవరం. పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో ఈ అంశం మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. నిజానికి పోలవరం అనేది ఒక జాతీయ ప్రాజెక్టు అంటే కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సి ఉంటుంది. కానీ గత టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేలా దానికి తగిన నిధులు కేంద్రం ఇచ్చేలా కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందం ప్రకారం నిధులు అడగగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక కేంద్రం మాట మార్చింది. అదేంటంటే గత ప్రభుత్వ హయాంలో నిర్వాసితులకు ఇవ్వాల్సిన ప్యాకేజీ కూడా కేంద్రమే ఇస్తానని పేర్కొనగా ఇప్పుడు మాత్రం దానికి తమకు ఏమీ సంబంధం లేదని మాట మార్చింది.
అంతేకాక 2014లో అంచనాలు ఏవైతే ఉన్నాయో ఆ మేరకు మాత్రమే నిధులు ఇస్తామని ఇప్పుడే అంచనాలకు తగ్గట్టు ఇవ్వలేమని కేంద్ర అని తేల్చేసింది. ఈ క్రమంలో దీనికి కారణం వైసిపి చేతగానితనం అని టిడిపి విమర్శిస్తూ ఉండగా , కాదు అంత టీడీపీ చేసిన అవినీతి వల్లనే వైసీపీ విమర్శిస్తోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఈరోజు సోమశిల హై లెవెల్ లెఫ్ట్ కెనాల్ ఫేస్ 2 పనులుకు సంబంధించిన పైలాన్ ని ఆవిష్కరించిన ఆయన ఆ తదనంతరం మాట్లాడుతూ 2022 లో పోలవరాన్ని జాతికి అంకితం చేస్తానని ప్రకటించారు. అంతేకాక పోలవరం ప్రాజెక్టు నుంచి 2022 ఖరీఫ్ సీజన్ కల్లా నీళ్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అంటే దానికి తగ్గట్టు కేంద్రం నుంచి జగన్ కి హామీ లభించింది ఉంటుందని అందుకే ఆయనను ధీమాగా ప్రకటించి ఉంటారని భావిస్తున్నారు విశ్లేషకులు.