మోడీని ఢీ కొడుతున్న జగన్‌.. రైతు భరోసా నేరుగా డబ్బులు ఇస్తాడట

432

జగన్‌ మోహన్‌ రెడ్డి అత్యంత కీలకమైన నిర్ణయం ప్ర‌క‌టించారు. రైతు భరోసా పథకం క్రింద ప్రతి రైతుకు 12500 రూపాయలను ఇవ్వనున్నాడు. అయితే ఈ మొత్తం డబ్బును లబ్ధిదారులకు బ్యాంక్‌ అకౌంట్లో కాకుండా నేరుగా చేతికే ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రతీ ఒక్కరు బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరపాలంటూ మోడీ అండ్‌ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. జన్‌దన్‌ ఖాతాలంటూ తొలి టర్మ్‌లో దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున బ్యాంక్‌ అకౌంట్లు కూడా తెరిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు లబ్ధిదారునికే చేరేలా బ్యాంకుల్లో జమచేయడం మొదలు పెట్టారు. ఇలా లబ్ధిదారుల అకౌంట్‌లో నగదు జమకావడం వల్ల అవినీతి తగ్గుతుందని, ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా ఉంటాయన్నది మోదీ ఆలోచన. అయితే జగన్‌ తీరు మోడీ ఆలోచనలకు భిన్నంగా ఉందనే చెప్పాలి.

54లక్షల మంది రైతు భరోసా పథకం క్రిందకి వస్తారు.. ఒక్కో రైతుకి 12500 రూపాయలను నేరుగా ఇవ్వడం అంటే అవినీతికి అవకాశం లేకపోలేదు. జగన్‌ తీసుకునే ఈ నిర్ణయం ప్రతి పక్షాలకు ఆయుధంగా మారే అవకాశమూ ఉంది. ఒక పక్క మోదీ డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తూ, క్యాష్ లెస్‌ విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్న సమయంలో.. ప్రభుత్వ పథకాన్ని ఇలా నగదు రూపంలో ఇస్తాననడం కేంద్రప్రభుత్వానికి మింగుడు పడే విషయం కాదు. క్యాష్‌లెస్‌ మంత్రాన్ని గట్టిగా అవలంబిస్తున్న మోడీ జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారా..? ఇప్పటి వరకు మోదీ జగన్‌ల మద్య ఉన్న స్నేహపూరిత వాతావరణం చెడే అవకాశమూ ఉంది.. మరి జగన్‌ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు..?