ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి సోషల్ మీడియాలో షాక్ తగిలింది. ఒకప్పుడు ఆయన్ను భారీగా ఫాలో అయిన ఆయన అభిమానులు ఇప్పుడు ఆయన్ను అన్ ఫాలో అవుతున్నారు. కాని జగన్ ని దాదాపు పది లక్షల మంది అన్ ఫాలో కొట్టడం గమనార్హం. ఎన్నికలకు ముందు జగన్ కి ఉన్న ఫేస్బుక్ ఫాలోవర్స్ సంఖ్య ఒకసారి చూస్తే 2.8 లక్షల మందికి పైగా ఉన్నారు. అంటే 28 లక్షల మంది.
ఇప్పుడు ఆయన ఫాలోయింగ్ బారీగా తగ్గింది. ఇప్పుడు 1.7 కి వచ్చింది ఆయన ఫాలోయింగ్. అంటే ఆయన్ను దాదాపు 11 లక్షల మంది అన్ ఫాలో కొట్టారు. ఇందులో ఫేక్ అకౌంట్స్ లో ఒక రెండు లక్షలు తీసేసినా… దాదాపు 8 లక్షల మంది ఆయనను పక్కన పెట్టారు. దీనికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా గత పది రోజుల నుంచి ఆయన ఫాలోయింగ్ భారీగా తగ్గిపోయింది అంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలు… ఆయన కులం మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక కరోనా విషయంలో ఆయన చేస్తున్న ప్రసంగాలపై వైసీపీ అభిమానుల్లో కూడా అసహనం ఉందని అంటున్నారు. అందుకే ఆయన్ను వాళ్ళు పక్కన పెట్టారని, ఇప్పటి వరకు జగన్ ఒక్క విలువైన ప్రసంగం కూడా చేయడం లేదని, ఆయన ప్రజల్లో చులకన అవుతున్నారని వైసీపీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.