మోడిని ఫాలో అవుతున్న జగన్, అలాగే కేబినేట్ భేటీ…!

-

కరోనా వైరస్ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు బడ్జెట్ ప్రవేశ పెట్టడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కరోనా వైరస్ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం లేదు. ఈ నేపధ్యంలో రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలలకు సరిపడా నిధుల కోసం ఆర్డినెన్స్‌తో తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపధ్యంలో శుక్రవారం రాష్ట్ర కేబినేట్ సమావేశం కానుంది.

సాధారణంగా నిర్వహించే సమావేశం మాదిరి కాకుండా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా ఇప్పుడు ఈ సమావేశం నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో ఇప్పుడు కేబినేట్ సమావేశం జరుగుతుంది. బడ్జెట్ స్థానంలో ఆర్డినెన్స్‌ను తీసుకురావడంపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జూన్ 30 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన ఖర్చులను లెక్కించి అప్పుడు ఆర్డినెన్స్ రెడీ చేస్తారు.

అక్కడ ఆమోదించి ఆ తర్వాత రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచంద్ కి ఆ ఆర్డినెన్స్ ని పంపే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 31 లోపు గవర్నర్ ఆమోదం తెలపాలి. వోట్ ఆన్ ఎకౌంటు ద్వారా దీనిని ఆమోదించనున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు బడ్జెట్ ఆమోదించారు. 2004 లో, 2014 లో రాష్ట్ర విభజన సమయంలో దీనిని ఆమోదించారు.

Read more RELATED
Recommended to you

Latest news