ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వికేంద్రీకరణ బిల్లును ఎలాగైనా ఆమోదం పొందేలా అన్ని రకాల చర్యలు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో చైర్మన్ అడ్డుకోవటంతో వైయస్ జగన్ తీవ్ర స్థాయిలో శాసన మండలి వ్యవహరిస్తున్న తీరుపై గురువారం జరిగిన అసెంబ్లీ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులచేత శాసనసభలో ఆమోదం తెలుపుతున్న గాని శాసనమండలిలో ఉన్న పెద్దలు ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకోవటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని మాట్లాడుతూ శాసన మండలి రద్దు ఈ విషయంలో అందరూ ఓ నిర్ణయానికి వచ్చే సోమవారం జరిగే అసెంబ్లీలో ఎవరికి వారు తమ అభిప్రాయాలు తెలియజేయాలని జగన్ సూచించారు. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు జగన్ రాజకీయంగా అటు వద్ద ఆంధ్ర మరియు రాయలసీమ ప్రజల దృష్టిలో తెలుగుదేశం పార్టీని దోషిగా నిలబెట్టడం జరిగిందని కామెంట్లు చేస్తున్నారు.
ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీలు పొత్తుల సునీత మరియు పొత్తుల సురేష్ భార్యాభర్తలు వైసీపీ లోకి రావాలని తీసుకున్న నిర్ణయంతో భేటీ అవ్వటంతో జగన్ ఫుల్ ఖుషి అయినట్లు సమాచారం. అయితే భార్యాభర్తలు ఇద్దరూ వైసీపీ పార్టీలోకి రావడం వెనుక కథ మొత్తం వైసిపి పార్టీ నేత చీరాల నియోజకవర్గానికి చెందిన నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ ఉన్నట్లు సమాచారం.