ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామ, వార్డు వాలంటీర్లకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఉగాది పర్వ దినం సందర్భంగా వాలంటీర్లనున సీఎం జగన్ మోహన్ రెడ్డి సన్మానించనున్నారు. వాలంటీర్ల సేవలను గుర్తించేలా ఉగాది రోజున తగిన ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలని గత సంవత్సరం నుంచి అవార్డులు ఇస్తున్నారు.
ఏప్రిల్ 2 నుంచి వారిని సత్కరించడానికి వీలుగా మండలాలకు జ్ఙాపికలు, ప్రశంసా పత్రాలు చేరుకున్నాయి. రోజుకు రెండు సచివాలయాల చొప్పున ఏప్రిల్ మాసమంతా ఈ మహోత్తర కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మూడు కేటగిరీల్లో అవార్డులు, రివార్డులు అందజేయనున్నారు.
వాలంటీర్లపై ఫిర్యాదులుంటే.. వారికి నగదు బహుమతి ఇవ్వన్న మాట. మొదటి కేటగిరీలో వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డు అందజేస్తారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఏడాదికి పైగా సేవలందించిన వారికి అవార్డుకు ఎంపిక చేస్తా రు. వీరికి రూ.10 నగదు, ప్రసంశా పత్రం, శాలువా, బ్యాడ్జీతో సత్కరించనున్నారు.