ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.తాజాగా ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు.ప్రజల జీవితాలతో ఆడుకునే జలగ జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నరసాపురం సభలో మాట్లాడుతూ.. ‘వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.13 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్.. జే బ్రాండ్ మద్యం, గంజాయి, డ్రగ్స్ తెచ్చారు. వైసీపీ నాయకులే వాటిని అమ్ముతున్నారు అని అన్నారు. కిరాయి దుకాణాల్లోనూ గంజాయి దొరుకుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీని 160 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి’ అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే… జగన్ సింగిల్ గా కాదు.. శవాలతో వస్తారని తెలుగుదేశం పార్టీ నేత లోకేశ్ చేసిన ట్వీట్కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ‘రాజకీయాల్లోకి శవాలను తెచ్చింది నీ తండ్రి చంద్రబాబే. పూటకు గతిలేని నీ తండ్రి శవాలను అడ్డుపెట్టుకుని ఈ స్థాయికి వచ్చారు అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఇప్పుడు పెన్షనర్ల చావులకూ ఆయనే కారణం అని ఆరోపించారు. ప్రతిదానికీ ముగింపు, పరిహారం ఉంటుంది. ఈ ఎన్నికలతో టీడీపీకి, చేతబడులు చేస్తూ బతికే మీ తండ్రీకొడుకుల రాజకీయ కెరీర్కు సమాధి తప్పదు’ అని తెలిపింది
.