తండ్రి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్ అడ్డుకుంటున్నారు : ప్రధాని మోడీ

-

ఏపీలో కేంద్రం అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే.. వైసీపీ ఎందుకు చేయడం లేదని మోదీ ప్రశ్నించారు. ‘అనకాపల్లి-అనంతపురం వరకు ఆరు లేన్ల రోడ్డు నిర్మించాం. రాయ్పూర్ నుంచి విశాఖ వరకు హైవే నిర్మాణంలో ఉంది. IIIT, ఐసర్, ఐఐఎం మంజూరు చేశాం. విశాఖలో పెట్రోల్ యూనివర్సిటీ ప్రారంభించాం.నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు మంజూరు చేశాం. వైసీపీ అవినీతి తప్ప అభివృద్ధి చేయడం లేదు’ అని ఆరోపించారు.

విశాఖ కేంద్రంగా ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక రైల్వే జోన్ను కేటాయిస్తే.. దానికి ప్రభుత్వం భూమి ఇవ్వలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘కేంద్రం 24 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం నిర్మించలేదు. తన తండ్రి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్ అడ్డుకుంటున్నారు అని విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ లో శాండ్, ల్యాండ్ మాఫియా విజృంభిస్తున్నాయి. ఏపీలో దేవాలయాలపై దాడులు జరిగాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ఆలయాలను రక్షిస్తాం’ అని భరోసా ఇచ్చారు మోడీ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news