ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఇప్పుడు కలకలం రేపుతుంది. తగ్గింది అసలు లేదు అనుకున్న తరుణంలో రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇప్పుడు అధికారులను కంగారు పెడుతుంది. గుంటూరు జిల్లాలో ఏకంగా 114 కేసులు నమోదు కావడం తో ఇప్పుడు ప్రజల్లో భయం మొదలయింది. జిల్లా యంత్రాంగం లో కలవరం మొదలయింది. ఇప్పుడు కరోనా సోకిన వాళ్ళు అందరూ ఎక్కడ తిరిగారో ఎవరికి తెలియదు
వాళ్ళు ఎవరికి అంటించారు అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు కరోనా పరిక్షలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కిట్స్ కొరత చాలా దారుణంగా ఉంది. కర్నూలు గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పూర్తిగా పరిక్షలు చెయ్యాల్సి ఉంది. వేగంగా పరిక్షలు చేసి రోగులను బయటకు తీసుకుని రావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షలను పెంచడానికి విదేశాల మీద ఆధారపడాలి అని భావిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ అధికారులు చైనా సహా క్యూబా అధికారులతో చర్చలు జరుపుతున్నారు. తమకు కరోనా టెస్ట్ కిట్స్ భారీగా కావాలని ఇక్కడ కేసులు పెరుగుతున్నాయి అనే విషయాన్ని వాళ్లకు చెప్పి ఇప్పుడు భారీ మొత్తం అయినా సరే చెల్లించి తీసుకోవాలి అని చూస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి సహకరిస్తాం అని చెప్పినట్టు సమాచారం. త్వరలోనే ఈ కిట్స్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.