అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు, నా తండ్రి వల్లే వచ్చా…!

-

అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాపై అల్లు అర్జున్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఎలా అయినా సరే ఈ సినిమాతో హిట్ కొట్టాలని బన్నీ పట్టుదలగా ఉన్నాడు. అతను నటించిన నా పేరు సూర్య సినిమా గత ఏడాది విడుదలై ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాకు చిత్ర యూనిట్ భారీగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడం, వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. “నా తండ్రి నిర్మాత కాబట్టి సినిమాల్లోకి రావడం నాకు ఈజీ అయింది.

నేను దాన్ని కాదనడం లేదు. అయితే వారసత్వం ఉన్నంత మాత్రాన అందరూ నిలబడలేరు. ఎవరైనా కష్టపడాల్సిందే. మా సమస్యలు మాకుంటాయి. స్వయంగా ఎదిగిన నటులను నేను గౌరవిస్తా. వారిని ప్రత్యేకంగా అభినందిస్తుంటా” అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. అయితే చిరంజీవి ఇమేజ్ తోనే అతను సినిమాల్లోకి రాగలిగాడు గాని చిరంజీవి లేకపోతే మెగా ఫాన్స్ అతన్ని అసలు ఎక్కడ పట్టించుకుంటారు అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news