మంత్రిపై జగన్ సీరియస్… అసలు ఎం జరిగింది…?

-

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయం సాధించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. రాజకీయంగా బలం స్థానిక ఎన్నికల ద్వారా మరింతగా పెంచుకునే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఈ మేరకు కీలక సూచనలు చేస్తూ వచ్చారు ముఖ్యమంత్రి.

ఎక్కడా ఏ అలసత్వం ప్రదర్శించకుండా ఎన్నికలు నిర్వహించాలని మెజారిటి పంచాయితీలు ఏకగ్రీవం చెయ్యాలని జగన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రులకు చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అయితే ఇక్కడ ఒక మంత్రి అలసత్వం ప్రధర్శించారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొందరు టీడీపీ నేతలకు ఆయన పరోక్షంగా సహకరిస్తున్నారని జగన్ కి సమాచారం వచ్చింది.

ఇటీవల సచివాలయానికి వెళ్ళిన సిఎం మంత్రిని పిలిచి విషయం అడిగారట. తాను ఎవరికి సహకరించలేదని మీకు తప్పుడు సమాచారం ఇచ్చారని మంత్రి వాపోయారు. అసలు విషయం అడిగారట… తనను నియోజకవర్గంలో జిల్లాలో టార్గెట్ చేసారని, తన మనుషులుగా కొందరు వెళ్లి టీడీపీ నేతలతో మాట్లాడారని, తనకు అసలు ఆ అవసరమే లేదని మంత్రి జగన్ కి వివరించారట. కొందరు టీడీపీ నాయకులు రావాలని చూసారని చెప్పారు.

దీనిపై జగన్ స్పందిస్తూ ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం మర్యాదగా ఉండదని, అసలు టార్గెట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకురాకుండా వేచి చూసారని సదరు మంత్రి మీద ముఖ్యమంత్రి మండిపడినట్టు సమాచారం. ఇలాంటి మైండ్ గేమ్స్ జరుగుతూనే ఉంటాయని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీడియా సమావేశాలు పెట్టి విషయం బయటకు చెప్పాలని సూచించారట.

Read more RELATED
Recommended to you

Latest news