సుప్రీం కోర్ట్ కి లొంగిన జగన్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పార్టీ రంగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులను మార్చాలంటూ ఇటీవల హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. వీటిని ఇన్నాళ్ళు జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక ఈ విషయంలో ముందుకి వెళ్ళడమే మంచిది అనే అభిప్రాయానికి జగన్ దాదాపుగా వచ్చేసినట్టే సమాచారం, వాటిని మార్చడానికి సిద్దమయ్యారు.

ఈ విషయమై సీసీఎల్ఏ (భూ పరిపాలన ప్రధాన కమిషనర్) ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న రంగులను మార్చి కొత్త రంగులను వేయాలా? లేకపోతే ఉన్న రంగుల్లోనే కొన్ని మార్పులు చేయాలా? అనే విషయంలో ఆ కమిటీ పరీశీలించి ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. నివేదిక వారం రోజుల్లో ప్రభుత్వానికి చేరుతుంది.

అప్పుడు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఆ రంగుల్లో స్వల్ప మార్పులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. బులుగు రంగునే మొత్తం వెయ్యాలని భావిస్తున్నారు. వైసీపీ అనగానే చాలా మందికి బ్లూ కలర్ కనపడుతుంది. దీనితో ఆ రంగుని పూర్తి స్థాయిలో ఉంచాలని భావిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గుర్తులను వేశారంటూ టీడీపీ పిటీషన్ వేసింది. సుప్రీం కోర్ట్ కి వెళ్ళినా సరే హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని సమర్ధించింది.

Read more RELATED
Recommended to you

Latest news