ప‌ర‌మ‌ వీరచక్ర పొందిన మొదటి సైనికుడు సోమ్ నాథ్ శర్మ‌

-


అప్పుడ‌ప్పుడే పాకిస్థాన్ – ఇండియాలు రెండు దేశాలుగా విడిపోయాయి. కాశ్మీర్ ను మాత్రం రాజా హ‌రిసింగ్ పాలిస్తున్నాడు.! ఆయ‌న‌కో ఆప్ష‌న్ ఇచ్చారు త‌న రాజ్యాన్ని ఇండియాలో కానీ, పాక్ లో కాని క‌ల‌వొచ్చని ..హ‌రిసింగ్ త‌న రాజ్యాన్ని ఇండియాలో క‌ల‌పాల‌ని ఫిక్స్ అయ్యాడు..కానీ అధికారికంగా ఆ తంతు ఇంకా పూర్త‌వ్వ‌లేదు. ఈక్ర‌మంలో పాక్ బ‌ల‌గాల క‌న్ను కాశ్మీర్ పై ప‌డింది. పాక్ స‌రిహ‌ద్దుల్లో ఉండే గిరిజ‌న తెగ‌ల‌కు ఆయుధాల‌ను అందించి కాశ్మీర్ ను పూర్తిగా ఆక్ర‌మించాల‌నే క‌సిని వారిలో ర‌గిల్చి వ‌దిలారు. ఈ గిరిజ‌న తెగ‌….శ్రీన‌గ‌ర్ కు 50 కిలో మీట‌ర్ల దూరంలో ఉండే…మ‌హురా అనే విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాన్ని ఆక్ర‌మించుకొని దాన్ని ధ్వ‌సం చేశారు. దీంతో శ్రీన‌గ‌ర్ పూర్తిగా చీక‌టిమ‌య్య‌మైంది.

హ‌రిసింగ్ పిలుపు అందుకున్న నెహ్రూ ఈ బాధ్య‌త‌ను స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ కు అప్ప‌గించాడు. కాశ్మీర్ ప‌రిస్థితిని గ‌మ‌నించాల‌ని…కుమావ్ రెజిమెంట్ ను లొకేష‌న్ కు పంపించాడు ప‌టేల్. కుమావ్ రెజిమెంట్ కు మేజ‌ర్ సోమ్ నాథ్ శ‌ర్మ‌…అప్ప‌టికే త‌న ఎడ‌మ‌చేతికి గాయంతో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ ఆదేశంతో త‌ల బ‌ల‌గాన్ని శ్రీన‌గ‌ర్ ద‌గ్గ‌ర్లోని బ‌డ‌గావ్ వ‌ద్ద మోహ‌రించాడు.

700 మంది సైనికుల‌తో ఉన్న పాక్ సేన‌..భార‌త సైనికులున్న బ‌డ‌గావ్ వైమానిక స్థావ‌రాన్ని టార్గెట్ చేసుకుంటూ బాంబుల వ‌ర్షం కురిపిస్తుంది. ఇండియా సైన్యం 100 మాత్ర‌మే…అయిన‌ప్ప‌టికీ ఓక్కో సైనికుడు కొద‌మ‌సింహాల్లా పాక్ సేన‌ల మీద విరుచుకుప‌డ్డారు. సోమ్ నాథ్ శ‌ర్మ పాక్ సేన‌లు పేల్చుతున్న మోర్టార్ ల‌ను త‌ప్పించుకుంటూ ఇండియా సైనికులున్న పోస్ట్ లకు తిరుక్కుంటూ బాంబ్ ల‌ను , తుపాకుల‌ను అందిస్తున్నాడు.అక్క‌డి యుద్ద ప‌రిస్థితిని ఉన్న‌తాధికారుల‌కు వివ‌రిస్తూ శ‌త్రువులు మాకు 50 గ‌జాల దూరంలో ఉన్నారు…మా సంఖ్య కంటే చాలా రెట్లు ఉండి భీకరంగా కాల్పులు జ‌రుపుతూ మ‌న స్థావ‌రంమైపు దూసుకొస్తున్నారు. అధ‌న‌పు బ‌ల‌గాల అవ‌స‌రముంది. ఈ లోపు మేము ఇండియాలోని ఒక్క అంగుళం కూడా వారికి ద‌క్క‌కుండా చివ‌రి వ‌ర‌కు పోరాడుతాం. అని చెప్పాడు. అప్ప‌టికే సిద్దంగా ఉన్న భార‌త సైన్యాలు ఆ ప్రాంతానికి చేరుకొని ప్ర‌త్య‌ర్థుల‌ను త‌రిమికొట్టాయి. కానీ ఈక్ర‌మంలో శ‌త్రువుల మోర్టార్ సోమ్ నాథ్ శ‌ర్మ ప‌క్క‌నే ఉన్న బాంబుల డంప్ మీద ప‌డ‌డంతో….ఆ పేలుడులో ప్రాణాలు కోల్పోయాడు. శ‌ర్మ చ‌నిపోయిన 3 రోజుల త‌ర్వాత గుర్తుప‌ట్ట‌ని స్థితిలో ఆయ‌న మృత‌దేహం ల‌భ్య‌మైంది. !

అలా స్వాతంత్రం వ‌చ్చిన కొత్త‌ల్లోనే దేశం కోసం తన ప్రాణాల‌ను ధార‌బోసిన ఈ వీరుడుకి- తొలి ప‌ర‌మ వీరచక్ర పురస్కారం ద‌క్కింది.

సోమ్ నాథ్ శ‌ర్మ వీర‌మ‌ర‌ణం- 1947 నవంబరు 3.

Read more RELATED
Recommended to you

Latest news