జగన్ పుట్టిన‌ రోజు(డిసెంబ‌ర్ 21)న‌.. ఏపీలో కొత్త ప‌థ‌కం..

-

ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన సేవలు అందించేలా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది వైఎస్ స‌ర్కార్‌. అయితే వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అనంతపురం జూనియర్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం జగన్‌ మాట్లాడారు. డిసెంబర్‌ 21(ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు) నుంచి అందరికీ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేస్తామన్నారు.

డెంగ్యూ, మలేరియాను ఆరోగ్యశ్రీలో చేర్చుతామన్నారు. జనవరి 1 నుంచి 2వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చుతామన్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభిస్తామన్నారు. మార్కాపురంలో కిడ్నీ వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య డాటాను సేకరిస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news