టీడీపీ గుండెల్లో రైళ్లు.. మరో విచారణకు జగన్ ఆదేశం..?

-

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఐదేళ్ల పాలనలోని అవినీతిని వెలుగులోకి తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. అందుకే అధికార పీఠం ఎక్కిన తొలిరోజుల్లోనే అనేక విచారణలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా వేల కోట్ల అక్రమాలకు అవకాశం ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ ఆపేయించారు.

ఏ ప్రాజెక్టు అయినా సరే 25 శాతం కంటే తక్కువ పని జరిగితే దాన్ని ఆపేయాలని ఆదేశాలు వెళ్లాయి. అందులో భాగంగానే అమరావతి ప్రాజెక్టులు కూడా ఆగిపోయాయి. ఇక పోలవరం పనుల్లోనూ వందల కోట్లు అవినీతి జరిగిందని వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అందుకే జగన్ సర్కారు రివర్స్ టెండర్లకు వెళ్తోంది. ఈ విషయంలో జగన్ సక్సస్ కూడా అయ్యారు.

ఇక అవినీతి ఆరోపణల విచారణ కోసం నియమించిన కమిటీలు తమ పని తాము చేస్తున్నాయి. అవి త్వరలోనే రిపోర్టులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయాలపై ఇప్పటికే టీడీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. ఈ విచారణలు కేవలం టీడీపీ పై బురద జల్లడానికేనా.. లేకుంటే కేసులు, జైళ్లు కూడా ఉంటాయా అన్న ఆందోళన మొదలైంది.

ఈ పరిస్థితుల్లో తాజాగా..జగన్ సర్కారు మరో విషయంలో విచారణకు ఆదేశించారు. గిరిజనుల ఉత్పత్తులకు ధర కల్పించకుండా గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఈ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే.. గిరిజన సహకార సంస్థ.. జీసీసీలో గత ఐదేళ్లలో వందల కోట్ల రూపాయల అవినీతిపై డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విచారణకు ఆదేశించారు. గత నాలుగేళ్లుగా ఆడిట్‌ జరగకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీసీసీ కేంద్రాల్లో సరుకుల కొనుగోళ్ల అవినీతిపై విచారణ చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్‌లో జరిగిన గోల్‌మాల్‌పై కూడా ఆరా తీయాలన్నారు. అవినీతిలో భాగస్వాములైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తాజా విచారణతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news