సాధారణంగా పులంటే ఎవరికి భయం ఉండదు? అందరికీ భయమే. అది జూలో ఉన్నా.. అడవిలో ఉన్నా.. ఎలాంటి ప్రమాధం ఉండదు. అదే రోడ్డెక్కితే.. దాని రచ్చ మామూలుగా ఉండదు. ఇదే సంఘటన ఇప్పుడు కుమ్రంభీమ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ అడవి పులి రోడ్డెక్కి ప్రయాణికులను హడలెత్తించింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ బెజ్జూర్ ప్రధాన రహదారిలో కొండపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఓ పెద్ద పులి రోడ్డు మీదకు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బెజ్జూర్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సుకు పులి అడ్డురావడంతో అందులో ఉన్న విద్యార్థులు సెల్‌ఫోన్‌లో ఫొటోలను తీసి అధికారులకు పంపించారు. పులి సంచరిస్తుండటంతో పెంచికల్‌పేట్ నుంచి సలుగుపల్లి, బెజ్జూర్‌వెళ్లే ప్రయాణికులు రాకపోకలు బంద్ చేసి ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.