కావాల్సినవి :
రవ్వ : 100 గ్రా.
పాలు : అర లీటరు
చక్కెర : పావావు కప్పు
డ్రై ఫ్రూట్స్ : 100 గ్రా.
యాలకుల పొడి : పావు టీస్పూన్
నెయ్యి : ఒక టేబుల్‌స్పూన్
గుమ్మడి గింజలు : ఒక టీస్పూన్
తయారీ :
ఒక గిన్నెలో పాలు పోసి వేడి చేసుకోవాలి. అవి వేడి అయ్యేలోపు పక్కన కడాయిలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టాలి. అదే కడాయిలో రవ్వ వేసి కాస్త రంగు మారే వరకు వేయించాలి. ఈ రవ్వను మరుగుతున్న పాలల్లో పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. పది నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. ఇందులో చక్కెర, యాలకుల పొడి వేసి కలుపాలి. మరో రెండు నిమిషాలు ఉంచి వేయించిన డ్రై ఫ్రూట్స్, గుమ్మడి గింజలు వేసి కలిపి దించేయాలి. టేస్టీ రవ్వ కేసరి రెడీ.