అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం, వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళగిరి ఎయిమ్స్‌లో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు, అధికారులు మొక్కలు నాటారు. గత ఏడాది నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలు, ఆస్పత్రుల్లో 33 కోట్ల 23 లక్షల మొక్కులు నాటారు.
సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని జగన్ పిలుపునిచ్చారు. చెట్ల పెంపకంతో చాలా అవసరాలు తీరుతాయన్నారు. చెట్లు నాటితే కాలుష్యాన్ని నివారించడంతో పాటు ఎక్కువగా వర్షాలు కురిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం కనిపించాలని సూచించారు. చెట్ల పెంపకం యజ్ఞంగా సాగాలన్నారు. రాష్ట్రాన్ని పచ్చతోరణంగా తీర్చిదిద్దాలని జగన్ పిలుపు నిచ్చారు.
జగనన్న పచ్చతోరణం- వన మహోత్సవం 2021 ప్రారంభ కార్యక్రమం.
AIIMS, మంగళగిరి.Watch Live: https://t.co/nGxxw1JvQw#JaganannaPachaThoranam
— YSR Congress Party (@YSRCParty) August 5, 2021