న్యూఢిల్లీ: పెగాసస్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. పెగాసస్‌పై దర్యాప్తు కోరుతూ మొత్తం 9 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై కోర్టులో పిటిషనర్లు వాదనలు వినిపిస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై పెగాసస్ దాడి చేసిందని కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఆరోపణలు చాలా తీవ్రమైనవేనని సీజేఐ ఎన్వీరమణ అన్నారు. పిటిషన్లను మరింత లోతుగా పరిశీలించాలని ఎన్వీరమణ అభిప్రయం వ్యక్తం చేశారు. చాలా పరిజ్ఞానం ఉన్న వారే పిటిషన్లు వేశారని, కచ్చితమైన సమాచారాన్ని జోడించాల్సి ఉందని ఎన్వీరమణ పేర్కొన్నారు.
ఇక దేశంలో పెగాసస్ వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. పెగాసస్ స్పైవేర్ ద్వారా ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌కు గురవుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలు.. పెగాసస్ పై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పలువురు నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో ఆసక్తికర ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.