తెనాలిలోని జరిగిన వైసిపి సిద్ధం సభలో ఇంటి పట్టా ని అందుకున్న గీతాంజలి అనే మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలో చరచనీయంశంగా మారింది సొంత ఇంటి కల నెరవేరింది అనే ఆనందంలో ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె అనూహ్యంగా రైలు కింద పడినానికి పాల్పడింది. దీంతో ఆమె భర్త ప్రతిపక్ష టిడిపి పై దుమ్మెత్తి పోస్తున్నారు పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో గీతాంజలి మీద చెప్పుకోలేని విధంగా ట్రోలింగ్ చేశారని ఆమె భర్త అన్నారు.
ఈ అవమానాన్ని భరించలేక రైలు కింద పడి చనిపోయింది అన్నారు. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు జగన్ మాట్లాడుతూ గీతాంజలి బలవన్మరణానికి పాల్పడిన ఘటన పై ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు ఆమె మరణం తనని తీవ్రంగా కలచివేస్తుంది అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని కచ్చితంగా అదుకుంటామన్నారు మహిళల ప్రతిష్ట మర్యాదకు భంగం కలిగిస్తే చట్టం ఏ ఒక్కరిని వదిలిపెట్టదన్నారు సీఎం జగన్ ఆమెకి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.