పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం మీద పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. సిఏఏ ద్వారా లౌకికవాదం మీద ప్రత్యక్ష దాడి చేస్తున్నారన్నారు. నార్త్ 24 పరాఘన జిల్లాలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు సిఏఏ తో ముందుకు వెళ్లాలని బిజెపి నిర్ణయం పూర్తిగా వైఫల్యంతో ముగుస్తుంది అన్నారు.
మతము ఆధారంగా పౌరసత్వం గురించి మీరు ఎప్పుడు వినలేదు ఈ చర్య మానవత్వానికి అవమానం అన్నారు అంతేకాక దేశం మౌలిక సూత్రాలకు విరుద్ధమన్నారు రేకెత్తించడానికి బిజెపి ప్రయత్నం చేస్తుందన్నారు. దీని ద్వారా దేశంలో అశాంతి నెలకొనే ప్రమాదం ఉందన్నారు సీఏఎ నిబంధనల మీద అనేక అనుమానాలు ఉన్నాయన్నారు ఎన్ఆర్సి పేరుతో 13 లక్షల మంది మినహాయించారని ఇది ప్రజల హక్కుల్ని హరించి వేసే కుట్ర అన్నారు.