పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు !

-

పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. స్పిల్‌వే, అప్రోచ్‌ఛానల్, అప్‌స్ట్రీం కాఫర్‌ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం, గేట్ల అమరిక తదితర కీలక పనుల పురోగతి పై సమీక్షించిన సీఎం జగన్ పోలవరం నిర్మాణంలో గత ప్రభుత్వ తప్పిదాల వల్ల పనులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని సమావేశంలో ప్రస్తావించారు. స్పిల్‌ వే పూర్తి చేయకుండా కాఫర్‌ డ్యాం నిర్మాణం వల్ల ఇబ్బందులు వచ్చాయని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఒక పద్ధతి ప్రకారం కాకుండా.. అక్కడక్కడ అరకొరగా పనులు చేసి వదిలిపెట్టారని చర్చలో ప్రస్తావనకి వచ్చింది.

గతంలో కాఫర్‌ డ్యాంలో ఉంచిన ఖాళీల వల్ల వరదల సమయంలో సెకనుకు సుమారు 13 మీటర్లు వేగంతో వరద ప్రవాహం వచ్చిందని సీఎంకు తెలిపిన అధికారులు మే నెలాఖరు నాటికి కాపర్‌ డ్యాం పనులను పూర్తి చేస్తామని అన్నారు. అలానే పోలవరం వద్ద వైయస్సార్‌ గార్డెన్స్‌ నిర్మాణంపై సీఎం సమీక్ష చేయగా వైయస్సార్‌ గార్డెన్స్‌    మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనలను సీఎంకు వివరించారు అధికారులు అయితే పోలవరం వద్ద జి– హిల్‌సైట్‌పై 100 అడుగుల ఎత్తుతో నిర్మించనున్న వైయస్సార్‌ విగ్రహం ప్రకృతి సమతుల్యతను  పెంచే విధంగా ఉండాలని పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news